Tuesday 11 February 2014

Telugu Education Tips


RESIDING DEITY OF VIJAYAWADA - GODDESS KANAKA DURGA - RIVER SIDE OF KRISHNA - BHAVANI DWEEPAM OR BHAVANI ISLAND - BEST PICNIC SPOT IN ANDHRA PRADESH, VIJAYAWADA, INDIA





GODDESS SRI KANAKA DURGA - INDRAKEELADHRI - VIJAYAWADA - ANDHRA PRADESH - INDIA







Telugu Bhakthi Audio Songs - Goddess Sri Kanaka Durga Amma vari Bhakthi Patalu in Telugu - Sri Durga Namamrutha Dhara - Download and Enjoy

LORD DATTHATHREYA - THE THREE GODS


బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే దత్తాత్రేయుడు :

ఆయన బ్రహ్మదేవుని మానసపుత్రుడు. అత్రి మహర్షి, బ్రహ్మదేవుని దివ్య నయనాల్లోంచి జన్మించాడట. అత్రి మహర్షి సతీమణి మహాసాత్వి అనసూయ. నారదుడు త్రిలోక సంచారం చేస్తూ అక్కడి విశేషాలు, ఇక్కడ, ఇక్కడి విశేషాలు అక్కడ చెప్తూ ఉండేవాడు. అలా ఆయన ఒకసారి అనసూయ గొప్పతనం గురించి చెప్పగా లక్ష్మి, పార్వతి, సరస్వతి అసూయ చెందారు. ఆమెను పరీక్షించమని త్రిమూర్తులను పంపారు.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రి మహర్షి ఇంటికి వెళ్లారు. వారు వెళ్ళిన సమయానికి అత్రి ఇంట్లో లేకపోవడంతో అనసూయ అతిథి మర్యాదలు చేసేందుకు నడుం బిగించింది. భోజనం సిద్ధం చేసి పిలవగా, వారు ''నీవు వివస్త్రగా వడ్డిస్తేనే తింటాం'' అన్నారు. అనసూయ చలించకుండా , త్రిమూర్తులను బాలులుగా మార్చి, వారు కోరినట్లుగానే వడ్డించింది. అదీ ఆమె ఔన్నత్యం. సంతోషించిన త్రిమూర్తులు తమ ముగ్గురి అంశతో వారికి ఒక బాలుడు పుడతాడని దీవించి వెళ్లారు. అలా అత్రి, అనసూయలకు జన్మించిన పుత్రుడే దత్తాత్రేయుడు.

కనుక, దత్తాత్రేయుడు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారం. గురుస్వరూపుడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ‘గురువు' అంటే దత్తాత్రేయుడే! గురువు, దేవుడు ఒకరిలోనే ఉండడం విశేషం. శాస్త్రాలు, ఉపదేశాలు, పూజలు, జపాలు ఏవైనా సరే, గురుముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు, రాణింపు కలుగుతాయి. అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు గురుదేవుడయ్యాడు.

దత్తాత్రేయుడు భక్తవత్సలుడు. భక్తులపై అంతులేని కారుణ్యాన్ని కురిపిస్తాడు. దత్తాత్రేయుని ఆరాధించేందుకు ఆర్భాటాలూ, ఆడంబరాలు అక్కర్లేదు. నిండు మనస్సుతో, నిష్కల్మషమైన హృదయంతో ప్రార్థిస్తే చాలు, ప్రత్యక్షమై వరాలు కురిపిస్తాడు. అందుకే దత్తాత్రేయుని ‘స్మృతిగామి’ అంటారు.

దత్తాత్రేయుడు విశిష్టమైన ఆచార్యస్థానం ఆక్రమించాడు. ఈ విశిష్టమైన స్థానం ఇంత తేలిగ్గా లభించిందా అని ఆశ్చర్యపోనవసరం లేదు. సాక్షాత్తూ దేవదేవుడైన దత్తాత్రేయుడు 24 మంది గురువుల వద్ద విద్యను అభ్యసించాడు. కనుకనే దత్తాత్రేయుని పరమ గురువుగా కొలుస్తున్నాం.

వివేకంతో, విచక్షణతో, ఆలోచనల్ని అంతర్ మధించి అసలైన జ్ఞానాన్ని అందింపుచ్చుకోవాలి. అది మన కర్తవ్యం. అలాంటి విచక్షణాపరులుగా రూపొందాలి. సాధారణంగా ప్రతి మనిషికీ వివేకం, విచక్షణ, వితరణ – ఈ మూడింటిని అందించగలిగేవాడు గురువు. అందుకే సృష్టిలో కన్నవారి తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించినవాడు గురువు.

దత్తాత్రేయుడు గురువులకే గురువు విజ్ఞాన ఖని. అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా గురువుల వద్ద వినయంగా విద్యను అభ్యసించిన సద్గుణ సంపన్నమూర్తి. సకల వేదస్వరూపుడు. జ్ఞానామృతాన్ని జగత్తుకు పంచిన సద్గురు చక్రవర్తి. మౌనముద్రతోనే శిష్యుల సందేహాలను నివృత్తి చేసి గురుస్థానం దక్కించుకున్న దత్తాత్రేయుడు విశ్వానికే గురువయ్యాడు. అందుకే నిరంతరం దత్తాత్రేయుని ప్రార్దిస్తాం. జన్మ సంసార బంధనాల్ని తేలిగ్గా తెంచగలిగిన మహానుభావుడు, జ్ఞానానందాన్ని పంచగలిగిన ప్రేమమూర్తి, ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు.

మనసా స్మరించినంత మాత్రాన సాక్షాత్కరించే దయాసింధువు దత్తాత్రేయుడు మనకు లభించడం మన అదృష్టమే. కనుక ఎల్లవేళలా దత్తాత్రేయుని ధ్యానించుకుందాం.
దత్తాత్రేయుడు విశ్వమంతా పరచుకుని ఉన్నాడు. ఆయన గుప్తంగా దాగివుంటాడు. తనను కొలిచే వారిని కనిపెట్టుకుని ఉంటాడు. తన అనుగ్రహానికి పాత్రులైన వారిని గుర్తించి వరాలు ప్రసాదిస్తాడు. అంతటి కరుణామూర్తి దత్తాత్రేయుడు. అంతేనా, మనిషిలోని అసలు మనిషిని వెలికితీయగల మహిమాన్వితుడు.

THE BIRTH HISTORY OF LORD DATTHATREYA IN TELUGU







పూర్వము అత్రి,అనసూయ దంపతులు వున్నారు వారు సర్వ దర్మాలను కలిగిన వారు. ఒక రొజు ఇంద్రునికి బయము కలుగుతుంది ఎందుకు అంటే అనసూయ తల్లి మహ సాద్వి ఇంద్రుడు బయ పడుతు త్రిమూత్రులని ఆశ్రయిస్తాడు స్వామి భూ లొక ముందు అనసూయ తల్లి అను మహ సాద్వి వున్నది ఆ తల్లి దగ్గర వాయువు బయపడుతున్నడు, అగ్ని దెవుడు తన కిరణాలను సున్నితంగ ప్రసరిస్తున్నాడు భూ మాత అనసూయ తల్లి నడుచె చొట సున్నితంగ వుంటుంది ఎక్కడ ఆ తల్లి శాప ప్రభావానికి ఎక్కడ గురి అవుతామూ అని బయ పడుతున్నరు ఆ తల్లి సదాచారలు తపస్సు లను చుసి నాకు నా ఇంద్ర పదవి పొతునుందొ అని బయము కలిగినది మీరె నన్న రక్షించాలి అని త్రిముర్తులుని ఆశ్రయిస్తాడు. 
త్రిముర్తులు ముగ్గురు ఋషి వెష దారులై ఆ తల్లి ని పరిక్షిస్తున్నరు. ఒ మాత నీవు మహ సాద్వి అని సదాచారాలు బాగ చెసెదవని విని నె వద్దకు వచ్చాము అని చెప్పారు. ఆ తల్లి ఋషి వర్య నెను మీకు ఎమి చెయగలను సెలవియ్యండి అని ఆ తల్లి వినయంగా వారిని ప్రార్దించింది. త్రిమూర్తులు నీవు సరీరమున వస్తములు లెకుండ మాకు విందు నీయ వలెను అలా అయితెనె మీ ఆతిద్యము స్వీకరిస్తాము లెనిచొ మా దారిన మెము వెల్లె దము అని చెప్పిరి. ఆ తల్లి ఎమిటి యింత కటిన పరిక్ష నాకు అని వెదనతొ అతిదులు కొరినది చెయటమె ధర్మము అని తెలుసుకుని మనసున తన భర్తని స్మరించె కొద్దిగ జలము తొ వారి పె చల్లింది త్రిముర్తులు మువ్వురు పసి బిడ్డలుగ మార్చి వెసి వారికి స్తన్యము నిచ్చీ వారి ఆకలి తీర్చీనది . అత్రి మాహార్షి వచ్చీ జరిగినది అంత తన దివ్య ద్రుష్టీ తొ చూసి వీరు త్రిముర్తులు అని తెలుసుకుంటారు.త్రిముర్తులు భార్యలు వచ్చీ మా దెవులను తిరిగి మాకు యివ్వండి అని అత్రి అనసూయా దంపతులను ప్రార్దిస్తారు అలా త్రిముర్తులు మరళ వారి నిజ రూపం పొంది అమ్మా నీవు మహ తపస్సు గల ధర్మచారినివి నీకు వరము యిచ్చెదము కొరుకొనుము అనగా ఆ తల్లి మీరు నాకు కుమారులుగ జన్ముంచాలి అని ఆ తల్లి వెడు కున్నది వారు అలనె మువ్వురము కలసి నీకు కుమారునిగ జన్మించీ దత్తత్రెయ అను నామంతొ ప్రసిద్ద మయ్యెదము అని వరం యిచ్చారు ఆ పరమాత్ముడె త్రిముర్తులు మువ్వురు నా అంశలె అని మానవాళికి తెలియ చెయుటకు వచ్చీన అవతారమె దత్తత్రెయ అవతారము ఈ దినమె దత్తత్రెయ జయంతి
కళియుగంలొ దాత్తవతారాలు శ్రి పాద శ్రి వల్లభులు 2)నృసింహ సరస్వతి 3)అక్కల కొట మహరాజ్ 4)మానిక్య ప్రభు 5) షిరిడి సాయి బాబ
సిద్ధమంగళ స్తొత్రము 
శ్రీమదనంద శ్రీవిభూషిత అప్పల లక్ష్మి నరసింహరాజా 
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ 
శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ
మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా 
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ 
సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ 
సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజరఋషి గోత్రసంభవ 
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ 
దో చౌపాతీ దేవ్ లక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ 
పుణ్యరూపిణీ రాజమంబ సుత గర్భపుణ్యఫల సంజాతా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ
సుమతినందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ
పీఠికాపుర నిత్యవిహారా మధుమతిదత్తా మంగళరూపా 
జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ
పరమ పవిత్రమైన యీ సిద్దమంగళ స్తొత్రమును పఠించిన యెడల అనఘాష్టమి వ్రతము చేసి సహస్ర సభ్ద్రాహ్మణ్యమునకు భొజనము పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి, ఎక భుక్తము చెయుచూ, కాయా కష్టముతొ ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సభ్ద్రాహ్మణ్యమునకు భొజనము పెట్టిన ఫలము లభించును. ఈ స్తొత్రము యోగ్యులచె పఠింపబడును. దీనిని పఠిచుట వలన సిద్దపురుషుల దర్సన, స్పర్శనములు లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనసా,వాచా.కర్మణా దత్తారాధన చేయు భక్తులు యీ స్తొత్రమును పఠించినంతనే శ్రీ పాదుల కృపకు పాత్రులగుదురు. ఈ స్తొత్రమును పఠించిన చోట సూక్ష్మవాయుమండలము నందలి సిద్దులు అదృశ్యరూపమున సంచరించు చుందురు. శ్రి గురు దత్త జయ గురు దత్త


BHAKTHI IMPORTANCE OF SURYA NAMASKARAM


SHREE NAVAGRAHA YANTRAS


BHAGAWATHAM SARAMSAM IN POETRY


ARTICLE ON `SALAGRAMA" ROCK - LORD VISHNU RESIDES IN SALAGRAMAM - ARTICLE BY Brahmasri Chaganti Koteswara Rao Garu



సాలగ్రామము :

సాలగ్రామము విష్ణుప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వ్యావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.

హిందువులందరికీ తులసి, శంఖం, సాలగ్రామం పూజనీయమైనవి. తులసి హిందువుల ఇహపర సాధనానికి భూలోకంలో అవతరించిన వనదేవత. ఈ తులసి అపూర్వమైన మూలిక కూడా. శంఖం అత్యంత పవిత్రమైనది. శంఖారావం వ్యాపించినంత దూరం సూక్ష్మక్రిములు నశిస్తాయి అంటారు. నీరు శంఖంలో పూరిస్తే తీర్థం అవుతుంది. వట్టివేళ్ళు, ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలు చేర్చిన నీటిని శంఖంలో పోసుకుంటూ సాలగ్రామాలకు పురుషుసూక్తం పఠిస్తూ అభిషేకం చేసిన తీర్థం సర్వశక్తివంతం. ఇటువంటి తీర్ధాన్ని భక్తితో సేవిస్తే ప్రాయశ్చిత్తం, పాపక్షయం కలుగుతుంది. తీర్ధాన్ని మూడుసార్లు తీసుకుంటారు. మొదటిది కాయసిద్ధి కొరకు, రెండవది ధర్మసాధనకు,మూడవది మోక్షం పొందడానికి. అసలీ తీర్ధం అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయం కలుగుతాయి.

సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం. సాలగ్రామ దర్శనం వల్ల, స్పర్శవల్ల, అర్చనవల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది. సాలగ్రామాలు శిలాజాలు. శాస్త్రజ్ఞులు ఈ శిలలను ఒక విధమైన ప్రాణి నిర్మిస్తుందని అంటారు. ఆలి అనే ఒక విధమైన మత్స్యం శీతాకాలంలో తన శరీరం నుంచి వెలువడే ఒక విధమైన రసాయనిక పదార్ధంతో శిలామయమైన కవచాన్ని నిర్మించుకుని దానిలో నివశిస్తుందని అది మరణించినప్పుడు లేక వదిలి వెళ్ళినప్పుడు అవి సాలగ్రామాలుగా మనకు లభిస్తాయని అంటారు. సాలగ్రామాల మీద వివిధ దేవతా చిహ్నాలు ఉంటాయి. ముఖ్యంగా చక్రం, పద్మం ప్రధాన చిహ్నాలు. విష్ణు భక్తులైన మాధ్వులకు, వైష్ణవులకు ఇవి పూజకు ఎంతో విలువైనవి. వైష్ణవ పురాణాలు, ఇతవ వైష్ణవ గ్రంధాలు వీటిని గురించి సవిస్తరంగా వివరిస్తాయి.

నేపాల్ దేశంలో ఖట్మండుకు సుమారు 197 మైళ్ళు దూరంలో ముక్తినాధ్, గండకీ నదీ తీరంపై ఉన్న మహాషేత్రంలో ఇవి లభిస్తాయి. ఇవి సాధారణంగా స్థలజాలు, జలజాలు అని రెండు రకాలు. గండకీ నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న సాలగ్రామ గిరిపైన స్థలజాలు, గండకీ నదీ గర్భంలో జలజాలు లభిస్తాయి. సాలగ్రామాలలో బంగారం ఉంటుంది. అందుకే వాటిని హిరణ్యగర్భ అని కూడా అంటారు. సాలగ్రామాలు అమోనైట్ శిలామాలు. ఇండియాలో ఈ సాలగ్రామాలు సముద్రంలో నివసించే టెథైస్ అనే ప్రాణి వల్ల ఏర్పడతాయి. ఇటువంటి శిలాజాలు అనేక రకాలు ఉన్నాయి. 250 మిలియన్ సంవత్సరాలలో ఇండియా ఉత్తర దిక్కుగా 9,000 కి.మీ. జరిగిపోయింది. హిమాలయాలు ఏర్పడ్డాయి. వీటి నుండి అనేక నదులు ప్రవహించాయి. ఇండో మైదానంలోకి ప్రవహించిన అటువంటి నదులలో ఒకటి గండకి. సాలగ్రామములు మన శాస్త్రం అనుసరించి కొన్ని సౌమ్యమైనవి. కొన్ని ఉగ్రమైనవి. శాస్త్ర సమ్మతంగా చక్రశుద్ధి, వక్త్రశుద్ధి, శిలాఉద్ధి, వర్ణశుద్ధి గల వాటినే పూజించాలి. రకరకాల రంగులు గలిగిన కారునలుపు, భగ్నమైన, మొక్కవోయిన సాలగ్రామాలను పూజించకూడదు. నారసింహ పాతాళ నారసింహ, గండభేరుండ, మహాజ్వాల మొదలైనవాటిని సన్యాసులు, బ్రహ్మచారులు పూజించాలి. విష్ణు, సీతారామ, గోపాల వంటి శాంతమూర్తులనే గృహస్థులు పూజించుకూవాలంటారు. పరిమాణాన్నిబట్టి కూడా పూజార్హతను నిర్ణయించుకుంటారు.. సాధారణంగా ఇవి ప్రతి గృహంలోనూ వంశపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. సాలగ్రామ శిలామహత్మ్యం గురించి వేరే చెప్పనక్కరలేదు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరునికీ, మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికీ అంతటి మహిమ ఉండడానికి కారణం అక్కడ ఉండే సాలగ్రామాలు అంటారు. సాలగ్రామాన్ని పూజిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో దాని దానం వలన కూడా అంతటి ఫలం లభిస్తుంది.

BE A GOOD MAN


Add caption

LORD SRI KRISHNA TEACHINGS IN TELUGU



You mig

STORY OF AGNI SARMA - ANCIENT INDIAN STORY IN TELUGU



వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలొ సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి - కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు, అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీదెగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతె చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి "నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు" అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని, నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు. 

మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కాని, ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చె ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబసభ్యులు. చాలా బాధ కలిగి, మళ్ళి ఆ ఋషుల దెగ్గరికి వచ్చి, నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు(వల్మీకం) కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయనని వాల్మీకి అని పిలిచి, బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుష నామమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి, పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడాయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటె, ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట. 

తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం | 
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ||

వాల్మీకి మహర్షి రామాయణంలొ రాసిన మొదటి శ్లోకం. దీని అర్ధం ఏంటంటె, తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటె................

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ||

ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటె నాకు చెప్పండి అని అడిగాడు.

నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలొ ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు........
ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు. 

చెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాన సమయంలొ సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది...........

మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః| 
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||

ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలొ ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక, అని శపించాడు. 

ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు "ఓ బ్రాహ్మణుడా! నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ." అన్నారు. ఆ శ్లోకానికి అర్ధం చూడండి......

"నిషాద" అంటె బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. "మా" అంటె లక్ష్మి దేవి. "మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః", అంటె లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. " యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్", కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జెరుగుగాక, అని ఆ శ్లోక అర్ధం మారింది. 

బ్రహ్మగారు అన్నారు, "నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను " నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు" అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు.

వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగ ఆయనకి బ్రహ్మ గారి వరం వల్ల జెరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంబించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంబించారు. తరవాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకుశలతో పాడించారు.

HINDU BELIEF IN GODS WHO ARE BLESSING ON MARRIAGE - ARTICLE ON TELUGU MARRIAGE AND ITS IMPORTANCE


RESPECT WOMEN / SAVE WOMEN


LIST OF EIGHT GANESH AVATARS ACCORDING TO HINDU MYTHOLOGY


LORD SRI RAMA PRAYER IN TELUGU



శ్రీరామంబలవైరినీలచికురం స్మేరాననం శ్యామలం
కర్ణాంతాయతలోచనంసురవరం కారుణ్యపాథోనిధిం
శోణాంభోరుహపాదపల్లవయుగం క్షోణితనూజాయతం
రాజత్కుండలగండభాగయుగళం రామంసదాహంభజే

తా!! మేఘునివలె నల్లనగు ముంగురులుకలిగి చిఱునవ్వుతోనొప్పు మొగంబుకలవాడును, నల్లనిదేహంబుకలవాడును, చెవులవరకుపొడవుగానున్న నేత్రంబులు కలవాడును దేవతలలో నుత్తముండును దయాసముద్రుండును, ఎఱ్ఱనితామర పద్మములవలె మృదువగుపాదంబులును కుండలములునుగలవాడును, నగు రామునిఎల్లప్పుడు సేవించుచున్నాను.

GODDESS KAMAKSHI DEVI - KANCHIPURAM



అమ్మవారు కామాక్షిదేవిగా కాంచీపురంలో ఉంటూ తన కడగంటి చూపుతోనే సృష్టి స్థితి లయలు చేస్తుంది. సృష్టి - క; స్థితి - ఆ; లయ - మ. కళ్ళతోనే చేస్తోంది కనుక కామాక్షి. అక్కడికెళ్ళి భక్తులు ఎవరైనా జపం చేస్తే దయతో చూస్తుందిట. అందువల్ల అక్కడ చేసిన జపఫలం కోటి గుణితంగా ఫలిస్తాయి. కనుక ఈక్షేత్రానికి కామకోటి అనిపేరు. ఆగ్నేయ వాయవ్యములకు నడుమ అమ్మవారు ఉంది.
కాంచీపురానికి వాయవ్యం వైపు ఉంటుంది శివకంచి. ఇక్కడ ఉన్న లింగాలలో ఒక్క లింగాన్ని అర్చించినా లేదా ఆప్రాంగణంలో ఏలింగాన్ని అర్చించినా కోటిలింగార్చన ఫలం లభిస్తుంది. అందువల్ల దీనిని రుద్రకోటి అంటారు. కనుక శివుడు పృథ్వీలింగమై వెలసిన చోటు రుద్రకోటి. దీనికే రుద్రశాల అని పేరు కూడా ఉంది.అక్కడ ఒక అద్భుతమైన మామిడివృక్షం మనకి ఇప్పటికీ అక్కడ కనపడుతూ ఉంటుంది. అది శివస్వరూపం. సంస్కృతంలోఆమ్రము అనగా మామిడి. ఒక్క మామిడి చెట్టురూపంలో ఉన్నాడు కాబట్టి ఏకామ్రేశ్వరుడు అయ్యాడు. శివుడు వృక్షరూపంలోనూ, మూలంలో లింగరూపంలోనూ ఉంటాడు. లింగం సైకతలింగం. కదళీకుసుమాకారంగా(అరటిపువ్వు ఆకారంలో) ఉంటుంది. పరమేశ్వరుడు కొన్ని ఆలయాలలో రాతి రూపంలో, కొన్ని ఆలయాలలో స్ఫటిక రూపంలో, కొన్ని ఆలయాలలో వృక్షరూపంలో ఉంటాడు. యుగాలక్రితం పురాణాలు వృక్షరూపంలో ఉంటాడు అనిచెప్పాయి. యుగాలు గడిచినా అవి అలాగే ఉన్నాయి. ఇది ఆశ్చర్యకరమైన అంశం. కొద్ది దశాబ్దాల క్రితం అక్కడ ఉండే పురాతన మామిడి చెట్టు దెబ్బతిన్నది. ఏకామ్ర రూపంలో శివుడు వెళ్ళిపోయాడు అని అందరూ అనుకుంటున్న సమయంలో చిత్రంగా మూలం నుంచి కొత్త మొలక వచ్చి మామిడి చెట్టు తయారయింది. భారతదేశం ఎలాంటిదంటే ఎంత మనం వాడగొట్టాలి, తీసిపారెయ్యాలి అన్నా మళ్ళీ మళ్ళీ చిగురించే మహావృక్షం లాంటిది భారతీయ సంస్కృతి. వేదంలో ఉందా అంటే ఉంది "వృక్షేభ్యో హరికేశేభ్యః". కనిపించే ప్రతి చెట్టుకీ శివుడు అని దణ్ణం పెట్టగలిగే సంస్కారం మనకి రావాలి.

SRI KALAHASTHEESWARA


NAMES OF DWADASA ADITYULU IN TELUGU - ACCORDING TO HINDU MYTHOLOGY


THE MEANING AND IMPORTANCE OF SHADAGOPAM/SATAGOPAM IN TEMPLES ?



గుడిలో దర్శనం అయ్యాక తీర్థం ,షడగోప్యం తప్పక తీసుకోవాలి .షడగోప్యం అంటే 
అత్యంత రహస్యం .అది పెట్టె పూజారికి కూడా విన్పించనంతగా కోరికను తలుచుకోవాలి .అంటే మీ కోరికే షడగోప్యము .మానవునికి శత్రువులైన కామము 

క్రోధము ,లోభము ,మోహము ,మదము ,మాత్సర్యము వంటి వాటికి ఇక నుండి దూరంగా వుంటామని తలుస్తూ తలవంచి తీసుకోవతము మరో అర్ధము .షడగోప్యమును రాగి ,కంచు ,వెండి లోహాలతో తయారు చేస్తారు .పైన విష్ణు పాదాలు వుంటాయి .షడగోప్యమును తల మీద వుంచినపుడు శరీరంలో వున్న విధ్యుత్ ,దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి ,మనలోని అధిక విద్యుత్ బయటికి వెళ్తుంది .తద్వారా శరీరంలో ఆందోళన ,ఆవేశము తగ్గుతాయి

LIFE TOGETHER


TOGETHER, MAY WE BE PROTECTED
TOGETHER, MAY WE BE NOURISHED
TOGETHER, MAY WE PRACTICE WITH GREAT VITALITY
MAY OUR PRACTICE BE BRILLIANT,
EFFECTIVE AND FRUITFUL
MAY WE ALWAYS BE IN PERFECT HARMONY

HEALTHY ADVANTAGES OF INDIAN TRADITION `SURYA NAMASKARAM'